మెగా 158 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ రేపే

Mega 158 Title Glimpse to Be Released Tomorrow

మెగా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది! మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఆయన 158వ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఆగస్టు 22న ఈ సినిమాకి సంబంధించిన ‘టైటిల్ గ్లింప్స్’ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.

పవర్ ప్యాక్డ్ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ టైటిల్ గ్లింప్స్ రేపు సోషల్ మీడియాలో రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాను సంక్రాంతి బరిలో నిలుపనున్నారు. రేపు రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.