యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను రాబడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా, అందమైన ఎమోషన్స్‌తో సాగింది. పల్లెటూరి వాతావరణం, హీరో హీరోయిన్ల మధ్య సాగే క్యూట్ లవ్ ట్రాక్, అలాగే ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమదైన సహజ నటనతో కట్టిపడేయగా.. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు అందించిన ఆహ్లాదకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ప్రాణం పోసి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. ఇప్పటికే ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి సినిమాపై హైప్ పెంచింది. ఇప్పుడు ఈ ఆసక్తికరమైన ట్రైలర్ కూడా తోడవడంతో ‘ఓ..! సుకుమారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























