కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మెగా 158 షూట్ అప్డేట్

Intense Action Schedule Begins for Mega 158

మెగా 158 షూట్ అప్డేట్

Intense Action Schedule Begins for Mega 158

Intense Action Schedule Begins for Mega 158

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మెగా 158(వర్కింగ్ టైటిల్) . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ బయటికి వచ్చింది.

ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, మునుపెన్నడూ చూడని ఒక (భారీ యాక్షన్ సీక్వెన్స్) ను చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో, వందలాది మంది ఫైటర్లతో ఈ ఫైట్ సీన్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు.

ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గకుండా, ఎంతో రిస్క్‌తో కూడిన పవర్‌ఫుల్ స్టంట్స్‌ను స్వయంగా చేస్తూ సెట్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వింటేజ్ చిరు మాస్ ఎనర్జీని గుర్తుచేసేలా ఉండే ఈ యాక్షన్ బ్లాక్ థియేటర్లలో ప్రేక్షకులకు, మెగా అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ టీజర్‌ను చిరు బర్త్ డే ఆగస్టు 22న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ ఫైట్ అప్‌డేట్‌తో 'ది బ్లడీ బెంచ్‌మార్క్' అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే బాబీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్