కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

దళపతి సెట్స్‌లో ఎలా ఉంటారంటే?

GOAT Pre Release Event Actress Meenakshi Interesting Comments About Thalapathy Vijay

దళపతి సెట్స్‌లో ఎలా ఉంటారంటే?

GOAT Pre Release Event: Actress Meenakshi Chaudhary Interesting Comments About Thalapathy Vijay

GOAT Pre Release Event Actress Meenakshi Interesting Comments About Thalapathy Vijay

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'The GOAT' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. 'The GOAT' సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లోనే ఇంత బిగ్ స్టార్స్‌తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విజయ్ గారు చాలా కామ్ పర్సన్. చాలా డెడికేటెడ్ గా వుంటారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. ఈ మూవీ జర్నీ చాలా మెమరబుల్. సెట్స్ లో చాలా ఫన్ వుండేది" అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. "ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్స్. వెంకట్ ప్రభుగారు చాలా కూల్ గా వుంటారు, ఎలాంటి సమస్యనైన కూల్ పరిష్కరిస్తారు. యువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. సెప్టెంబర్ 5న మూవీని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి" అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్