
ట్యాగ్ · 2 కథనాలు

'సప్తగిరి' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

ఫిలింఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో తెలుగు గడ్డకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులు కొమురం భీముడు పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
'సప్తగిరి' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా…