గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ కొట్టాడు నాచురల్ స్టార్ నాని.దసరా తో కెరీర్ లో తొలిసారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఆతరువాత వచ్చిన హాయ్ నాన్న కూడా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా తరువాత ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చేస్తున్నాడు.షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 29న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత నాని చేయబోయే సినిమా విషయం లో క్లారిటీ వచ్చింది.ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలు వున్నాయి.ఇందులో డివివి బ్యానేర్ లోనే సుజీత్ తో సినిమా చేయాల్సివుంది అయితే ప్రస్తుతానికి ఈసినిమాను హోల్డ్ లో పెట్టారు.ఇది కాకుండా తనకు దసరా తో బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల తో మరో సినిమా చేయనున్నాడు నాని.అలాగే హిట్ ప్రాంచైజీ హిట్ 3 లోకూడా నటించాల్సి వుంది.
ఈరెండు సినిమాల్లో మొదటగా హిట్ 3 ను మొదలు పెట్టనున్నాడట నాని. శైలేష్ కొలను డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో ఓ ప్రముఖ హీరో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.త్వరలోనే ఈసినిమా గురించి అనౌన్స్ మెంట్ రానుంది.డిసెంబర్ కల్లా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























