కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

గుంటూరు కారం పాటకు మహేష్ బాబు కుమార్తె సితార స్టెప్స్, వీడియో వైరల్

Sitara Ghattamaneni Dances to Guntur Kaaram Song Dum Masala

గుంటూరు కారం పాటకు మహేష్ బాబు కుమార్తె సితార స్టెప్స్, వీడియో వైరల్

E0 B0 97 E0 B1 81 E0 B0 82 E0 B0 9f E0 B1 82 E0 B0 B0 E0 B1 81 E0 B0 95 E0 B0 Be E0 B0 B0 E0 B0 82 E0 B0 Aa E0 B0 Be E0 B0 9f E0 B0 95 E0 B1 81 E0 B0 Ae E0 B0 B9 E0 B1 87 E0 B0 B7 E0 B1 8d

Sitara Ghattamaneni Dances to Guntur Kaaram Song Dum Masala

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మూవీ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో గానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, డైలాగ్ స్లాంగ్, డ్యాన్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

ఇక ఇదిలా ఉండగా.. తాజాగా హీరో మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గుంటూరు కారం చిత్రంలోని ఒక పాటకు డ్యాన్స్ చేసింది. సినిమాలోని 'ధమ్ మసాలా' సాంగ్‌కు సితార ఎంతో గ్రేస్‌తో స్టెప్పులేయడం విశేషం. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు తమ అభిమాన హీరో తనయ, ఏకంగా ఇలా తండ్రి పాటకే డ్యాన్స్ చేయడం చూసి మురిసిపోతున్నారు. సితార అదిరిపోయే స్టెప్పులేసిందని, అది కూడా సినిమాలో మాదిరే స్టెప్పులేసిందని సంబరపడుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాట గుంటూరు కారం మూవీలో కూడా మాంచి మాస్ బీట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అలాగే జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‌కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లుగా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్