
ట్యాగ్ · 3 కథనాలు

గుంటూరు కారం పాటకు మహేష్ బాబు కుమార్తె సితార స్టెప్స్, వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మూవీ మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో గానే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, డైలాగ్ స్లాంగ్, డ్యాన్స్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

సితార న్యూ వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార , పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుకుగా చిన్న వయసులోనే తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. తన డ్యాన్స్ వీడియో లను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ తో సితార ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో మహేష్ బాబు తన హిట్ సాంగ్స్ కు సితార అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో ఎంజాయ్ చేస్తూ మురిసిపోతున్నారు.
సితార క్యూట్ డ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పువ్వు పుట్టగానే పరిమళించినట్టు , చిన్న వయస్సులోనే తన డ్యాన్స్ టాలెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. సితార అద్భుతంగా డ్యాన్స్ చేసిన పలు వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసిన సితార మదర్ నమ్రత ఇప్పుడు మై లిటిల్ డ్యాన్సర్ బేబి అంటూ సితార డ్యాన్స్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో లోని సితార క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.