
ట్యాగ్ · 3 కథనాలు


భువన విజయమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

బర్త్ ఆఫ్ భువన విజయమ్- సునీల్ రోల్ రివీల్

భువన విజయమ్ ట్రైలర్ రిలీజ్
కమెడియన్, హీరో అయిన సునీల్ ఇప్పుడు మరోసారి ప్రధానపాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. భువన విజయమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాకు యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

భువన విజయమ్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం సునీల్ అటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే మరోపక్క హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. యలమంద చరణ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా భువన విజయమ్ అనే సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీసినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మే 12వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

బర్త్ ఆఫ్ భువన విజయమ్- సునీల్ రోల్ రివీల్
కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి తన మార్క్ కామెడితో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఇక కమెడియన్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అందాల రాముడు సినిమాలో హీరోగా చేసి హీరోగా కూడా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి లాంటి దర్శకుడితో మర్యాద రామన్న చేసి ఆ సినిమాతో హిట్ అవ్వడంతో సునీల్ రేంజ్ మారిపోయింది. కానీ ఆతరువాత చేసిన సినిమాలు మాత్రం సునీల్ కు విజయాలను అందించలేకపోయాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ కమెడియన్ గా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. అంతేకాదు తనలో ఉన్న పలు యాంగిల్స్ ను చూపించడానికి ఇప్పుడు ఏమాత్రం వెనుకాడట్లేదు. అందుకే…