స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సమంత కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలను స్టార్ట్ చేసింది సమంత. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అభిమానులతో ముచ్చటిస్తుంది. ఈనేపథ్యంలోనే ఓ అభిమాని మీకు నేను చెప్పేటంతటి దానిని కాదు, కానీ మీరు మరొక్కసారి ఎవరినైనా ప్రేమించొచ్చు కదా అంటూ ట్వీట్ చేయగా దానికి సమాధానంగా సామ్.. నిజానికి నన్ను మీరు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించగలరు అంటూ లవ్ ఎమోజిని యాడ్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇక సమంత సమాధానంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: