కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అల్లు అర్హ పై సమంత ప్రశంసలు

Samantha Superb Words About Allu Arjun Daughter Allu Arha

అల్లు అర్హ పై సమంత ప్రశంసలు

Samantha Superb Words About Allu Arjun Daughter Allu Arha

Samantha Superb Words About Allu Arjun Daughter Allu Arha

గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూ లో శాకుంతలం మూవీ లో భరతుడు గా నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ పై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ లో భారీ డైలాగ్స్ ను వందల మంది ముందు ఏ మాత్రం భయపడకుండా అల్లు అర్హ చెప్పిందనీ ,సెట్స్ లో అల్లు అర్హ తెలుగు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా అనిపించిందనీ , ఈ రోజుల్లో పిల్లలకు ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది కానీ అర్హకి తెలుగు అంత బాగా నేర్పించిన అల్లు అర్జున్, స్నేహరెడ్డిలకు హ్యాట్సాఫ్ చెప్పాలనీ సమంత అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్