గత ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది కస్టడీతో వస్తున్నాడు.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి చైతు ఫస్ట్ లుక్ గ్లింప్స్ అలానే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధింటిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మార్చి 16వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా టీజర్ రిలీజ్ టేమ్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ ను రేపు సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: