బెల్లంకొండ వారసత్వంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో హీరో బెల్లంకొండ గణేష్. మొదటి సినిమా స్వాతిముత్యంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా వాయిదా వేశారు మేకర్స్. ఈసినిమాను ముందు మార్చి 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ ను వాయిదా వేస్తూ అధికారికంగా తెలియచేశారు. స్టూడెంట్స్ కు పరీక్షలు ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నామని.. సమ్మర్ హాలీడేస్ లో కలుద్దాం అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసాని నటిస్తుంది. సునీల్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నారు.. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్వీ2 ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























