శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరా మూవీలో హీరో నాని రోజు వారీ కూలీ ధరణి పాత్రలో నటించారు. ఆ పాత్రకు తగ్గట్టుగా నాని తనను తీర్చిదిద్దుకున్నారు. ఈ మూవీలో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో పక్కా మాస్ అవతారంలో నాని కనిపించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరో నాని బర్త్ డే సందర్భంగా దసరా మూవీ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఒక కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. ఈ పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని.. కళ్ళజోడు ధరించి బీడీ తాగుతూ నడిచొస్తుంటే.. ఊర మాస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా కనబడుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: