కన్నడ హీరో ధ్రువ సర్జా పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తాజాగా ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్ ప్రేక్షకులను అలరించనుంది. వాసవి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఏపీ అర్జున్ దర్శకత్వం లో ధ్రువ సర్జా, వైభవి శాండిల్య జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్ కన్నడ మూవీ మార్చి 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అన్వేషి జైన్, చిక్కన్న, మాలవిక అవినాశ్, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్టిన్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. హీరో ధ్రువ మాస లుక్, అద్భుతమైన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీకి యాక్షన్ కింగ్ అర్జున్ కథను అందించడం విశేషం. మార్టిన్ మూవీ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: