బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్టీఆర్30 అప్డేట్ ఏదైనా ఉంటే తాము తప్పకుండా అందిస్తామనీ.. కానీ మీరు ఇలా నాన్ స్టాప్ గా అడగడం డైరెక్టర్ అండ్ టీమ్ కి చాలా ప్రెజర్ పెట్టినట్టు ఉంటుందనీ.. ఖచ్చితంగా పవర్ ఫుల్ అప్డేట్ ఏదన్నా ఉంటే తమ ఇంట్లో వాళ్ళకి కూడా రివీల్ చేయకుండా మీతో పంచుకుంటామనీ.. ఇది నా విన్నపం అనీ.. ఈ నెలలోనే ఈ మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభం అవుతుందనీ.. మార్చి 20 లేదా అంతకంటే ముందే షూటింగ్ మొదలుపెడతామనీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5కి రిలీజ్ చేస్తామనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: