తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ తన తరువాత సినిమాను విజయ్ తో చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చి మంచి విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను నిర్మిస్తున్న 7 స్క్రీన్ స్టూడియో వారు అధికారికంగా ప్రకటించారు. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. విజయ్ సార్‌తో మూడోసారి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మీకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. మాస్టర్, వారిసు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్న తర్వాత మూడవసారి దళపతి విజయ్ సర్‌తో కలిసి పని చేయడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది అని తెలిపారు.
ఇంకా సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు కూడా తెలిపారు. ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ తో జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇక దళపతి 67 హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియచేయనున్నట్టు పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: