రీ రిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ దేశముదురు

Allu Arjun Desamuduru is All Set to Re Release on 8th April

మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల.. వైకుంఠపురములో మూవీ ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను ఫ్యాన్స్ కోసం వారి బర్త్ డేలు, పలు ప్రత్యేకమైన రోజుల్లో రీ-రిలీజ్ చేస్తున్నారు. 4k వెర్షన్ లో మరింత బెస్ట్ అవుట్ పుట్ ను అందిస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ కాగా వాటికి అద్భుతమైన స్పందన లభించింది.స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8 న )సందర్భంగా అల్లు అర్జున్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ దేశముదురు సినిమాను 4k వెర్షన్ లో మేకర్స్ రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 5 =