గత ఏడాది బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలకృష్ణ తన తరువాత సినిమాను అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై అప్పుడే అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమాను ప్రకటించి కూడా చాలా కాలమే అవుతుంది. ఈగ్యాప్ లో అనిల్ కూడా బాలయ్య కోసం ఒక సాలిడ్ కథనే సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను డిసెంబర్ 8వ తేదీ గురువారం రోజు ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం పెట్టినట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు.
On Auspicious Note
Nata Simham #NandamuriBalakrishna and The Extraordinaire @AnilRavipudi gearing up to begin the HAVOC 🔥🤩💥#NBK108Muhurtham Tomorrow at 9:36 AM 🔒@MusicThaman @sahugarapati7 @harish_peddi @Shine_Screens pic.twitter.com/17droBmtlG
— Shine Screens (@Shine_Screens) December 7, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: