రామోజీ ఫిల్మ్ సిటీ లో సందడి చేస్తున్న సలార్ , హరిహర వీరమల్లు

Pawan Kalyan and Prabhas Movie Shootings Happening In Same Place, Salaar And Hari Hara Veera Mallu Movie Shootings Happening In Ramoji Film City, Pawan Kalyan and Prabhas Movie Shootings, Ramoji Film City, Hari Hara Veera Mallu, Pawan Kalyan, Nidhhi Agerwal, Krish Jagarlamudi, Prabhas, Jagapathi Babu, Prithviraj Sukumaran, Shruti Haasan, Prashanth Neel, Prabhas latest movie, Prabhas's Upcoming Movie, Salaar, Salaar 2023, Salaar Movie, Salaar Update, Salaar New Update, Salaar Latest Update, Salaar Movie Updates, Salaar Telugu Movie, Salaar Telugu Movie Latest News, Salaar Telugu Movie Live Updates, Salaar Telugu Movie New Update, Salaar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు 2023 మే 12న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన బస్తీ సెట్ లో సలార్ మూవీ షూటింగ్ జరుగుతుంది.ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఇంకొన్ని రోజులపాటు ఇక్కడే షూటింగ్ నిర్వహించనున్నారు.సలార్ షూటింగ్ జరుపుకుంటున్న పక్కనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం .గుర్రాలతో పాటు సాగే ఓ పోరాట ఘట్టాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు భారీ సినిమాల షూటింగ్స్ తో రామోజీ ఫిల్మ్ సిటీ లో సందడి నెలకొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.