నా పుట్టిన రోజున తలైవా బ్లెస్సింగ్

Lawrence takes blessings from Superstar Rajinikanth, Superstar Rajinikanth blessings, Superstar Rajinikanth, Rajinikanth, Choreographer Lawrence, Actor Raghava Lawrence, Raghava Lawrence, Anushka Shetty, Vadivelu, P Vasu, Lawrence latest movie, Lawrence's Upcoming Movie, Chandramukhi 2, Chandramukhi 2 Movie, Chandramukhi 2 Update, Chandramukhi 2 New Update, Chandramukhi 2 Latest Update, Chandramukhi 2 Movie Updates, Chandramukhi 2 Telugu Movie, Chandramukhi 2 Telugu Movie Latest News, Chandramukhi 2 Telugu Movie Live Updates, Chandramukhi 2 Telugu Movie New Update, Chandramukhi 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స డాన్సర్‌గానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మాస్’ అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ తరువాత పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. చిరంజీవి దగ్గర నుండి ఎంతో మందికి పలు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఆయన కొరియోగ్రఫి అందించిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ ను కలిశారు. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. నా పుట్టినరోజు నాడు నేను నా గురు తలైవాను కలిసి బ్లెస్సింగ్స్ ను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.. ఈ సందర్భంగా ఈ ఏడాది అన్నదానం చేయాలని ప్లానింగ్ చేస్తున్నా.. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నాకు కాస్త సమయం దొరికినప్పుడు నేనే స్వయంగా ఆ ప్రాంతాలను సందర్శించి అన్నదానం చేస్తాను అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇప్పటికే రాఘవా ముని, కాంచన, గంగ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రముఖి 2 సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. లక్ష్మీ మీనన్, మహిమా నంబియర్, మంజిమ మోహన్, శృతి దాంగే ఇంకా సుభిక్షా కృష్ణన్ నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో నటించిన వడివేలు కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. ఆర్.జీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =