రవితేజ ధమాకా టీజర్ రిలీజ్

ravi teja dhamaka movie teaser out now, dhamaka movie teaser out now, Ravi Teja, Sreeleela, Thrinadha Rao Nakkina, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Ravi Teja's Dhamaka, Dhamaka, Dhamaka Telugu movie, Dhamaka New Update, Dhamaka Telugu Movie New Update, Dhamaka Movie, Dhamaka Latest Update, Dhamaka Movie Updates, Dhamaka Telugu Movie Live Updates, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. మొదట పలు క్యారెక్టర్లు చేసి ఆ తరువాత హీరోగా తన సత్తా చాటి.. ఇప్పుడు మాస్ మహారాజాగా స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇక ఈ ఏడాది శరత్‌ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. ప్రస్తుతం రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. ఈసినిమాతో రవితేజ మరోసారు తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు గ్లింప్స్ పాటలు కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా టీజర్ కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈనేపథ్యంలో నేడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్‌ లో రవితేజ.. రెండు డిఫరెంట్ లుక్స్ లో ఒకదానిలో పక్కా మాస్ గా మరో లుక్ లో మంచి స్టైలిష్ అండ్ క్లాస్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. ఓ మాఫియా డాన్‌ గా రవితేజ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ డైలాగ్స్ మరియు ఫైట్స్ తో సాలిడ్ గా కనిపిస్తుంది. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మరి టీజర్ అయితే ఈసినిమాపై అంచనాలను పెంచేసింది.

 

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + five =