రాఘవ లారెన్స్ రుద్రుడు మూవీ రిలీజ్ డేట్
Raghava Lawrence Rudrudu Movie Release Date

డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరు గా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం రుద్రన్ , అధికారం , చంద్రముఖి 2 మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ , ప్రియా భవానీ శంకర్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ రుద్రన్ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రుద్రుడు గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రుద్రన్ ప్రీ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రుద్రన్ మూవీ ని తమిళ , తెలుగు, మలయాళ , కన్నడ భాషలలో విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టుగా ఓ ఇంటెన్స్ పోస్టర్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు.








