ఫైనల్లీ రిలీజ్ కు సిద్దంగా అల్లు శిరీష్ మూవీ

Allu Sirish New Movie Release Date Fixed,Allu Sirish, Allu Sirish Latest Movie Updates, Allu Sirish New Movie with Anu Emmanuel, Allu Sirish Prema Kadanta Movie Release Date Fixed, Allu Sirish upcoming movie, Allu Sirish’s movie with Rakesh Sashii, Allu Sirish’s Upcoming Movie With Anu Emmanuel Has Locked The Release Date, Allu Sirishs and Anu Emmanuel Upcoming Movie Prema Kadanta, Allu Srishs Upcoming Movie Prema Kadanta, Anu Emmanuel Upcoming Movie With Allu Sirish, Hero Allu Sirish, Prema Kadanta Release Date Fixed, Prema Kadanta Release Date Locked, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగానే సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. సినిమాల ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. అయితే మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ ఎక్కువగానే వచ్చింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చాడు మళ్లీ ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కరోనా సమయంలో అల్లు శిరీష్ ఒక సినిమా చేశాడు అదే ప్రేమ కాదంట అనే సినిమా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. అప్పట్లో ఈసినిమా నుండి వచ్చిన పోస్టర్లకు మంచి జబ్ యే క్రియేట్ అయింది. అయితే ఆ తర్వాత ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇక ఆతరువాత ఈసినిమా గురించే మర్చిపోయారు. అయితే ఇప్పుడు మరొకసారి ఈసినిమా గురించిన టాపిక్ తెరపైకి వచ్చింది. దానికి కారణం ఇప్పుడు అల్లు శిరీష్ కొత్త సినిమా గురించి అప్ డేట్ రావడమే.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ కాబోతుందని తెలిపారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని.. ఈసినిమా టైటల్, ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ కు సంబంధించిన అప్ డేట్లు త్వరలోనే ఇస్తామని తెలిపారు. అంతేకాదు వచ్చే వారం నుండిఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నట్టు స్పష్టం చేశారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రేమ కాదంట సినిమానే పేరు మార్చి రిలీజ్ చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఇది ఆ సినిమానేనా లేకపోతే కొత్త సినిమానా అన్నది తెలియాలంటే అప్ డేట్స్ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =