త్రివిక్రమ్-మహేష్ మూవీ పై నాని క్లారిటీ..!

Nani Gives Clarity About Trivikram And Mahesh Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Trivikram Srinivas,Director Trivikram Srinivas,Nani Gives Clarity About Upcoming Movie of Trivikram and Mahesh Babu,Trivikram Srinivas Movie Updates,Trivikram Srinivas Latest Movie Updates,Trivikram Srinivas and Mahehs Babu Movie, Trivikram Srinivas Movie with Mahesh Babu,Trivikram Srinivas and Mahesh Babu latest Updates,Mahesh Babu Movies,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu latest Movies, Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Movie With Trivikram Srinivas,Natural Star Nani Gives Clarity About Trivikram And Mahesh Movie,Natural Star Nani Movie with Mahesh Babu and Trivikram, Ante Sundaraniki Movie,Nani Ante Sundaraniki Movie,Natural Star Nani Ante Sundaraniki Movie Updates,Nani Upcoming Movie Releasing on 10th June Ante Sundaraniki Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆయన ఖాతాలో సర్కారు వారి పాట కూడా చేరిపోయింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా మే 12న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా వ్యవహరించబోతోన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇంకా మొదలు కాకముందే పలు వార్తలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈరూమర్లకు క్లారిటీ ఇచ్చాడు నాని. నాని నటించిన అంటే సుందరానికీ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే కదా. జూన్ 10వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్న నానిని ఈ విషయం గురించి అడుగగా .. అవన్నీ రూమర్సే అని స్పష్టం చేశాడు. అంతేకాదు ఒక్క త్రివిక్రమ్ సినిమానే కాదని .. తాను ఏ సినిమాలోనూ గెస్టు క్యారెక్టర్స్ చేయడం లేదని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

కాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కగా నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా నాని ‘దసరా’ చేస్తున్నాడు. ఈసినిమాలో ఫుల్ డిఫరెంట్ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 13 =