రామ్-బోయపాటి సినిమా గ్రాండ్ లాంచ్..!

Ram Pothineni Boyapati Srinu Movie Launched In Style,Boyapati Sreenu’s Film With Ram Pothineni Officially Launched With A Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Boyapati Sreenu,Director Boyapati Sreenu,Boyapati Sreenu Movie Updates,Boyapati Sreenu upcoming Movies,Boyapati Sreenu Movie with Ram Pothineni,Ram Pothineni Movie Updates,Ram Pothineni Upcoming Movies, Ram Pothineni New Movie Updates,Ram Pothineni Movie with Boyapati Sreenu,Ram Pothineni Upcoming Latest Movies,Ram Pothineni New Movie Officially Launched with pooja Ceremony, Ram Pothineni Movi with Boyapati Sreenu Officially Launched

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న రామ్ ఇప్పుడు ది వారియర్ అంటూ వచ్చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కుతున్న ఈసినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో పాటు రామ్ బోయపాటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇది తన కెరీర్ లో 20వ సినిమాగా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నేడు హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామ్, బోయపాటి తో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈనేపథ్యంలో బురుగుపల్లి శివ రామ కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. లింగుసామి మరియు వెంకట్ ప్రభులు స్క్రిప్ట్ ని తమ చేతులతో అందించగా బోయపాటి ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేసారు.

కాగా ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 6 =