హాలీవుడ్ బ్లాక్ బస్టర్ “టెర్మినేటర్”, “టైటానిక్ “మూవీస్ ఫేమ్ జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో శామ్ వర్దింగ్టన్, సిగోర్నీ వీవర్, జూయీ సల్దాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ “అవతార్”ప్రపంచవ్యాప్తంగా 2009 డిసెంబర్ 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించి 2. 847 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.లైట్ స్టార్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో శామ్ వర్దింగ్టన్, జూయీ సల్దాన్ ప్రధాన పాత్రలతో బ్లాక్ బస్టర్ “అవతార్ “మూవీ సీక్వెల్ “అవతార్ 2” మూవీ 2022 డిసెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. “అవతార్ 2” మూవీ ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో రిలీజ్ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజగా చిత్ర యూనిట్ “అవతార్-2” మూవీ టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ లో సముద్ర లోకాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. అద్భుతమైన గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా రూపొందిన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని “అవతార్ 2” మూవీపై ఆసక్తి ని కలిగించింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































