సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “సర్కారు వారి పాట” మూవీ నుండి రిలీజ్ అయిన “కళావతి “, “పెన్నీ”, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా “#SSMB28” మూవీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం సమ్మర్ కు ఫ్యామిలీ తో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేసే మహేష్ బాబు తాజాగా ఫ్యామిలీ తో ప్యారిస్ ట్రిప్ కు వెళ్ళారు. ఆ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ ట్రిప్ కంప్లీట్ అయిన తరువాత మహేష్ బాబు “#SSMB28” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: