
ట్యాగ్ · 2 కథనాలు


బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో..!

రెండు ప్రాజెక్ట్స్ తో తేజ బాలీవుడ్ రీ ఎంట్రీ
"రాత్ " మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ పలు సూపర్ హిట్ హిందీ , తెలుగు మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సూపర్ హిట్ "చిత్రం "మూవీ తో తేజ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "ఏ దిల్ "మూవీ తో తేజ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ కు దర్హకత్వం వహించిన తేజ ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరో గా తెరకెక్కుతున్న "అహింస " మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో..!
మొదటి సినిమా 'చిత్రం' తోనే సంచలన విజయం సాధించిన తేజ ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. ఈ మూవీ తరువాత మళ్ళీ కాజల్ తో మరో చిత్రం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఆయన ఇంత వరకు ఎటువంటి చిత్రం ప్రకటించలేదు. ఇక ఇటీవల గోపీచంద్ తో కూడా సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా రెండు టైటిల్స్ రిజిస్టర్…