ఐకాన్ స్టార్ బర్త్ డే.. స్పెషల్ మెసేజ్..!

Icon Star Allu Arjun Posts A Special Note On The Occasion of his birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Allu Arjun Posts,Icon Star Allu Arjun Posts A Special Note,Icon Star Allu Arjun Posts A Special Note on his Birthday,Icon Star Allu Arjun Birthday,Happy Birthday Allu Arjun, Allu Arjun Birthday,Allu Arjun Special Note,Allu Arjun Special Posts,Allu Arjun Special Birthday Note,Allu Arjun in Social Media,Allu Arjun Pushpa The Rule Movie Udpates,Allu Arjun Movies,Allu Arjun Latest Movie Updates, Allu Arjun upcoming Movies,Allu Arjun New Movie Updates

స్టైలీష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగిన నటుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమా ప్రకటించినప్పుడే సుకుమార్ ఐకాన్ స్టార్ అని పెట్టాడంటే తనకు బన్నీ మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇక మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తన కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. డిఫరెంట్ సినిమాలతో. పాత్రలతో, నటనతో, డ్యాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక బన్నీ హార్డ్ వర్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది బన్నీ హార్డ్ వర్కింగ్ నేచర్ గురించి పలు సందర్భాల్లో చెప్పినవారు ఉన్నారు. ఇక గతేడాది పాన్ ఇండియా ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బన్నీ నేడు తన 40వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయనకు టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు తన బర్త్ డే ఈసందర్భంగా తన లైఫ్ లో ఇప్పటివరకూ తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్ మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఫస్ట్ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ థ్యాంక్స్.. మీ ప్రేమాభిమానాలు, దీవెనలే నన్ను ఇంతటి వాడిని చేశాయి, ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే ఎంత అదృష్టవంతుడ్నో అనిపిస్తుంది. నా తల్లిదండ్రుల నుంచి మొదలుపెడితే… కుటుంబం, స్నేహితులు, నా టీచర్లు, శ్రేయోభిలాషులు, నా చిత్ర పరిశ్రమ, నా ప్రేక్షకులతో పాటు నా ప్రియాతిప్రియమైన అభిమానులు ఎంతో మంది నా జీవితంలో ఉన్నారు. నా ఈ అందమైన ఈ ప్రయాణంలో నను వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అంటూ బన్నీ తన పోస్టులో పేర్కొన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 20 =