ఇకపై సినిమాలు చేయను.. 2022 లాస్ట్ ఇయర్..!

Rahul Ramakrishna takes a shocking decision,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Rahul Ramakrishna,Rahul Ramakrishna New Movies,Rahul Ramakrishna Upcoming Movies,Rahul Ramakrishna Telugu Movies,Rahul Ramakrishna Latest Movie Updates,Rahul Ramakrishna Schoking Comments, Rahul Ramakrishna Schking Decision,Rahul Ramakrishna Arujn Reddy Movie,Rahul Ramakrishna in Super Hit Movie Arjun Reddy,Rahul Ramakrishna will not do movies,Rahul Ramakrishna will not act From next Year, Rahul Ramakrishna in RRR Movie,Rahul Ramakrishna new Movie RRR,Rahul Ramakrishna Upcoming Movie RRR,Rahul Ramakrishna In Social Media,Rahul Ramakrishna Tweet Goes Viral,Rahul Ramakrishna in Social Media, Rahul Ramakrishna Shared A tweet in Social Media about his acting,Rahul Ramakrishna tweet Goes Viral,#rahulramakrishna

సినిమా రంగంలో క్లిక్ అవ్వడం అంటే అంత మాములు విషయం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ అనేది కుదరకపోవడం వల్లనో.. అవకాశాలు రాకపోవడం వల్లనో కెరీర్ లో ఎదగలేరు. కానీ ఒక్కసారి క్లిక్ అయి నోటెడ్ అయి కాస్త అదృష్టం ఉంటే కెరీర్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలా ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ. ఆ సినిమా విజయంలో రాహుల్ రామకృష్ణ పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన కామెడీతో అంతలా మెప్పించాడు. రాహుల్ రామకృష్ణ పాత్రలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టమే. ఇక ఆ సినిమా తరువాత రాహుల్ రామకృష్ణ ఎంత బిజీ అయిపోయాడో కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజీ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ ఇకపై సినిమాలు చేయను అని ప్రకటించాడు. తన సోషల్ మీడియా వేదికగా.. ఇకమీదట సినిమాల్లో నటించనని.. 2022 లాస్ట్ ఇయర్ అని.. ఎవ్వరేమన్నా తను ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నాడు. దీంతో తన అభిమానులతో పాటు నెటిజన్స్ రాహుల్ తీసుకున్న సడెస్ డెసిషన్ కు షాకవుతున్నారు. దీనికి కారణం ఏంటని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. మరి రాహుల్ ఇంత సడెస్ గా అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో..? భవిష్యత్తులో అయినా రాహుల్ చెబుతాడేమో చూద్దాం..

కాగా కేవలం కామెడీ పాత్రలే కాదు సీరియస్ పాత్రలతోనూ తాను మెప్పించగలనని భరత్ అనే నేను, రిపబ్లిక్ లాంటి సినిమాలతో రుజువు చేశాడు రాహుల్. త్వరలోనే విడుదల కాబోతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లోనూ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఇంకా మెయిన్ లీడ్ రోల్స్ ఉన్న సినిమాల్లో నటించాడు. ఇలా రాహుల్ రామకృష్ణ తన నాలుగేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో.. ఎన్నో డిఫరెంట్ పాత్రల్లో నటించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =