అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఇప్పటికే వరుస సినిమాలతో, హిట్స్ తో దూసుకుపోతుంటే ఇక ఇదే వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మాత్రం ఒక మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటూప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగాలవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమాలు పలు పోస్టర్లు, టీజర్, పాటలు లాంటివి రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించన సంగతి తెలిసిందే కదా. అక్టోబర్ 8న ఈసినిమా థియేటర్లలో సందడి చేయడానికి వస్తుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించినా తరువాత మార్చుకోవడం జరిగింది.. ఈనేపథ్యంలో ఇక తాజాాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫామ్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 8వ తేదీనే తమ సినిమా వస్తుంది అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
#MostEligibleBachelor is 𝐌𝐚𝐫𝐜𝐡𝐢𝐧𝐠 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐎𝐜𝐭 𝟖𝐭𝐡. 😎💫
Exciting updates, promotions to start rolling soon. #MEBOnOct8th 🧡#AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official pic.twitter.com/7Y7d7sLjws
— Geetha Arts (@GeethaArts) September 7, 2021
కాగా ఈసినిమాలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. ఇంకా ఈ సినిమాలో ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఎప్పటినుండో ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈసినిమాతో అయినా హిట్ ఖాతాను తెరుస్తాడో లేదో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: