
ట్యాగ్ · 2 కథనాలు


గోవా లో "లైగర్"షూటింగ్ షెడ్యూల్

గోవాలో 'లైగర్' యాక్షన్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి.కరోనా వల్ల పలుమార్లు ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా.. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో విజయ్ కు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను అది కూడా నెట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షెడ్యూల్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఫారిన్ కు వెళ్లనున్నారట.

గోవా లో "లైగర్"షూటింగ్ షెడ్యూల్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్“మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. కిక్ బాక్సర్ నటిస్తున్న విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యారు. "లైగర్"షూటింగ్ 50 శాతం పైగా కంప్లీట్ అయ్యింది.