
ట్యాగ్ · 5 కథనాలు

ఓటీటీలోకి సుమంత్ 'మళ్ళీ మొదలైంది'
మళ్లీ ఓటీటీల రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితులు అసలు బాలేకపోవడంతో, థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా చిన్న సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఒక రకంగా ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ పెరిగింది కూడా గత రెండేళ్ల నుండే అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వేవ్ తరువాత కాస్త పరిస్థితులు అనుకూలించడంతో అప్పటివరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలను.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఆపిన సినిమాలను వరుసగా రిలీజ్ చేసేశారు. ఇక ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. మళ్లీ కొన్ని చోట్ల కర్ఫ్యూలు, థియేటర్లు మూసివేయడంతో.. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోతున్నాయి. మీడియం…

సుమంత్ 'మళ్ళీ మొదలైంది' ట్రైలర్ రిలీజ్
హీరో సుమంత్ ఈమధ్య స్పీడు పెంచాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమధ్య ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

'మళ్ళీ మొదలైంది' కన్ఫ్యూజన్ లో సుమంత్
ఈమధ్య ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ క్రియేటివిటీ బాగా వాడుతున్నారు. ఏరకంగా ప్రమోషన్స్ చేస్తే బజ్ వస్తుందో ఆ రకంగా ఆలోచిస్తూ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సుమంత్ చేస్తున్న సినిమాకు కూడా అదే రకంగా ఒక్కో క్యారెక్టర్ గురించి చెబుతూ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ చేస్తున్న సినిమా మళ్ళీ మొదలైంది. ఈసినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రీసెంట్ గా ఈసినిమాలో నటిస్తున్న పోసాని పోస్టర్ కూాడా రిలీజ్ చేశారు. పోసాని కుటుంబరావు గా నటిస్తుండగా...ఫ్యామిలీ మాన్ గా, భర్తల హక్కుల కోసం పోరాడే వ్యక్తి గా, రెస్టారెంట్ ల వద్ద డిస్కౌంట్ అడిగే వ్యక్తి గా ఉంటుందని…

'మళ్ళీ మొదలైంది' లో పోసాని
కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం సుమంత్ యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.