బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “తెరకెక్కింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు వచ్చాయి . ప్రజలంతా ఏం జరుగుతుందోనని
ఆసక్తి గా ఎదురు చుసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“స్కైలాబ్ ” మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ తమన్నా 11 వ తేదీ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి మూవీ పై అంచనాలను పెంచింది. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని దర్శకుడు వినోదాత్మంగా తెరకెక్కించారు. నిత్య మీనన్ సహ నిర్మాత గా వ్యవహరించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























