ట్యాగ్ · 2 కథనాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.. 6వ తేదీ (ఈ రోజు )“క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
మహారాజా రవితేజ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోడమే కాదు 2 లక్షల మేర లైక్స్ ను సొంతం చేసుకుంది.