సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
'రాధే శ్యామ్' - రాధా కృష్ణ క్రేజీ పోస్ట్
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వుంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు.. ఈ సినిమా కోసం ఎంత మందిఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం.. టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.