ట్యాగ్ · 3 కథనాలు
బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ 'ఓపిక' కు పరీక్ష
బిగ్ బాస్ 4 - మొన్న జరిగిన రాజు రాణి టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్న సోహెల్, అభి, హారిక వంతు అయిపోగా.. రాత్రి ఎపిసోడ్ లో అరియానా, మోనాల్ రాణులుగా రూలింగ్ చేశారు. మీకు నచ్చిన వస్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాపకాన్ని పంచుకోవాలని ఆదేశించింది అరియానా. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది. దీంతో సోహైల్ తన గుర్తుగా అభిజిత్‌కు సస్పెండర్, హారికకు కత్తి, మోనాల్‌కు టీ షర్ట్, అరియానాకు పర్ఫ్యూమ్, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు.
బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ కే 'అధికారం' ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ - 13 వ వారం అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇంక 14వ వారంలోకి అడుగుపెట్టారు. సండే ఫండే సంగతి పక్కన పెడితే అందరూ వెయిట్ చేసేది మాత్రం మండే అది కూడా నామినేషన్స్ ప్రక్రియ కోసం. కాస్త ఈ ఎపిసోడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హౌస్ మేట్స్ వాదనలతో హౌస్ మొత్తం హీట్ అవుతుంది.
బిగ్ బాస్ 4 - ఫినాలే టికెట్ గెలుచుకున్న అఖిల్
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' టాస్క్ గత నాలుగు రోజుల నుండి జరుగుతూనే ఉంది. ఫైనల్లీ ఈ రోజు ఈ టాస్క్ ముగిసింది. మరి నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకున్నారు అన్నది తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే. మూడో టాస్క్ లో భాగంగా దాదాపు ఒక రోజు మొత్తం ఉయ్యాలలోనే వున్నారు అఖిల్, సోహెల్. ఉదయం అయినా పట్టు వదలకుండా ఉయ్యాలలోనే ఉండిపోయారు. ఇక ఇద్దరిలో ఎవరూ దిగట్లేదని ఇద్దరూ ఆలోచించుకోండి అని అభి సలహా ఇచ్చాడు.