ట్యాగ్ · 2 కథనాలు
కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్
కాజల్-గౌతమ్ కిచ్లూ.. వన్మంత్ యానివర్సిరీ
కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.ఇప్పుడు ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి రోజుకో ఫొటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ.
కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల మూవీస్ తో పాటు యంగ్ హీరోల మూవీస్ లో కూడా నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", విష్ణు మంచు "మోసగాళ్ళు ", కమల్ హాసన్ "ఇండియన్ 2 ", దుల్కర్ సల్మాన్ "హే సనామికా "(తమిళ ), "ముంబై సాగా "(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.