కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Naga Shaurya Latest Film Updates

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

నాగశౌర్య స్టైలిష్ లుక్

హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాగశౌర్య నటించే చిత్రాలలో కొత్త కథానాయికలకు అవకాశం ఇస్తున్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా స్పోర్ట్స్ డ్రామా "NS20 "మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో తన పాత్రకై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ తో సిద్ధం అయ్యారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య , షిర్లీ సేతియా జంటగా రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో "

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య , రష్మిక జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నరేష్ , రఘు బాబు , వెన్నెల కిషోర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. "ఛలో " మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా , రష్మిక హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సొంత బ్యానర్‌లో నాలుగో సినిమా

ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు నాగశౌర్య. ఇప్పటికే ఐరా క్రియేషన్స్‌ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ఆ బ్యానర్ లోనే ఛలో, నర్తనశాల, అశ్వథ్థామ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మరో సినిమాను తన బ్యానర్ లో చేయడానికి రెడీ అయ్యాడు నాగశౌర్య. అంతేకాదు తన బ్యానర్‌లో చేయబోతున్న నాలుగో సినిమాను ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు కూడా.

TFN Adminవాట్సాప్

షేర్