ట్యాగ్ · 2 కథనాలు

హిట్ కాంబినేషన్స్ తో మూవీ
నాగశౌర్య స్టైలిష్ లుక్
హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాగశౌర్య నటించే చిత్రాలలో కొత్త కథానాయికలకు అవకాశం ఇస్తున్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా స్పోర్ట్స్ డ్రామా "NS20 "మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో తన పాత్రకై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ తో సిద్ధం అయ్యారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య , షిర్లీ సేతియా జంటగా రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.

హిట్ కాంబినేషన్స్ తో మూవీ
యంగ్ హీరో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. అలాగే నాగశౌర్య, మాళవిక నాయర్ కాంబినేషన్ లో కూడా గతంలో 'కళ్యాణ వైభోగమే' సినిమా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాంటిది ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.