బిగ్ బాస్ 4 – మొదటిసారి కంటతడి పెట్టిన అభిజిత్

Bigg Boss Telugu 4 Day

బిగ్ బాస్ 4 – నిన్న ఏవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ జరగగా అందులో అవినాష్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు లగ్జరీ బడ్జెట్ టాస్క్ మొదలయ్యింది. మరి ఏ టాస్క్ ఇచ్చారు.. ఎలా ఆడారు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే. ఎపిసోడ్ స్టార్టింగే సోహెల్ పొరపాటున ఫేష్‌వాష్‌కి బదులు తూత్‌ పేస్ట్‌‌ పెట్టి వాష్‌ చేసుకున్నాడు. దీంతో అవినాష్‌, అరియానా సోహైల్‌ని ఆటపట్టించారు. ఇక ఎవిక్షన్‌ పాస్‌ రావడంతో ఫుల్‌ జోష్‌లో ఉండటంతో.. ఇది గమనించిన సోహైల్‌.. సేవ్‌ అవగానే మారిపోయావంటూ అవినాష్‌పై సెటైర్లు వేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోపక్క అరియానా – అఖిల్… అవినాష్ ను ఏడిపించే పనిలో పడ్డారు. అవినాష్ చూస్తుండగా.. అరియానా భుజంపై చేసి వేసి.. ‘మేం ఫ్రెండ్స్.. ఇంకా క్లోజ్ అవుతున్నాం. నా బరువు మోయడానికి రెడీగా ఉంది.. ఒక అమ్మాయి నా బరువు మోయడానికి రెడీగా ఉంది అంటే.. మా మధ్య అసలు గ్యాప్ లేదు.. అంటూ కామెడీ చేశాడు… మరోపక్క అవినాష్‌.. మోనాల్‌ దగ్గరకి వెళ్లి రివర్స్‌లో వాళ్లని ఆటపట్టించాడు. అవినాష్‌ పక్కనే కూర్చున్న మోనాల్‌ కొంచం సేపు కూర్చొని..అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసి అరియానా, అఖిల్‌ నవ్వుకున్నారు.

ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ మొదలైంది. ఇంట్లోకి దెయ్యాన్ని పంపి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంట్లో దెయ్యం అరియానాకే కనిపించడంతో భయంతో బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది. ఆ దెయ్యంపైనే జోకులు వేస్తూ నవ్వుకున్నారు. అవినాష్‌ అయితే.. ‘ ఏ దెయ్యం నీకు పెళ్లి అయిందా అనిఅడగ్గా.. ఎంత కరువు ప్రాంతం నుంచి వచ్చావురా అయ్యా అంటూ కామెడీ చేశారు.ఇంత జోక్స్ వేసిన అవినాష్‌ ఫైనల్లీ వాష్‌రూమ్‌కి వెళ్లడానికి కూడా హారికను తోడుగా తీసుకెళ్లాడు. ఇక భయంకరమైన సౌండ్స్ చేసి హౌస్ మేట్స్ ను భయపెట్టాడు బిగ్ బాస్.

‘బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులంతా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారా? అంతా సోఫా దగ్గరికి రండి’ అంటూ దెయ్యం ఇంటికి సభ్యులను ఆదేశించింది. ఇంటి సభ్యులంతా సోఫాలో కూర్చొగా.. ‘ఏంట్రా మీరందరరూ నాకు హాయి చెప్పరా? నేను చాలా కోపం ఉన్నా. నేను ఒక దెయ్యాన్ని. నా పేరు జలజ. మీ అందరిని నాకు ఇష్టం వచ్చినట్లు ఇబ్బందులకు గురి చేస్తానని బిగ్‌బాస్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకొని వచ్చా. బిగ్‌బాస్‌ నియమాలు అంటే నాకు ఇష్టం. ఎవరైనా బిగ్‌బాస్‌ నియామాలు ఉల్లంఘిస్తే నాకు కోపం వస్తుంది. నేను వెళ్లిపోయిన అనుకున్నారా ఇంకా పోలేదు. అరియానా నీ గొంతు చాలా బాగుంది. నీ గొంతు వినాక.. నాకే పోటీగా వస్తావేమో అని భయమేస్తుంది. రేయ్‌ అవినాష్‌.. మీ అమ్మ నీ పెళ్లి కోసం పిల్లని చూస్తుంది. మీ అమ్మకి చెప్పు నా దగ్గరు రమ్మని’ అని దెయ్యం అనడం.. అవినాష్‌ ఇప్పుడే బయటకు రా..తాళి కడతా అంటూ తనదైన శైలీలో జోక్‌ చేసి నవ్వించాడు. ఇక దెయ్యం ఇంట్లో అందరికి తనకు నచ్చిన టాస్క్‌ ఇచ్చింది. మ్యూజిల్‌ వస్తే షర్ట్‌ లేకుండా డాన్స్‌ చేయాలని సోహైల్‌ని, గార్డెన్‌ ఏరియాలో ఉన్న చెట్టు ఆకులను లెక్కించాలని అభిజిత్‌కి టాస్క్‌ ఇచ్చింది. మరోవైపు మోనాల్‌ని అభిజిత్‌, అఖిల్‌ బాగా ఏడ్పించారని.. అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌.

దానిలో గెలిచిన వాళ్లు డేట్‌కి వెళ్తారని బిగ్ బాస్ లెటర్ పంపించడంతో అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. మోనాల్‌తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అని నేను చెప్తూ ఉన్నా.. మళ్లీ డేట్ ఏంటి? నేను తనని ఏడిపించడం ఏంటి? నాకు అసలు ఈ టాస్క్ వద్దు.. ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు. అసలు మోనాల్ టాపిక్ నా దగ్గర ఉండకూడదు అనుకుంటున్నా.. మేం ఇద్దరం కలిసి మోనాల్‌ని ఏడిపించడం ఏంటి? ఇది బిగ్ డీల్‌లా అనిపిస్తుంది. నాకు ఎక్కడో కొడుతుంది. నాకు ఈ మోనాల్ అభిజిత్ ప్రజెక్షన్ వద్దు.. ఏంటి ఇది అసలు.. గజిబిజి అవుతుంది అంతా.. మోనాల్ టాపిక్ తీసుకురావొద్దని అఖిల్‌తో చెప్పా.. ప్రతిసారీ మోనాల్ టాపిక్ వచ్చిందంటే నాకు రాడ్ పడుతుంది.నా జర్నీ మొత్తంలో ఈ మోనాల్‌ టాపికే బిస్కెట్‌ అవుతుంది. నేను మోనాల్‌తో డేట్‌కి పోను బిగ్ బాస్.. నాకు ఈ టాస్క్ వద్దు బిగ్ బాస్’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. మొదటిసారి అభిజిత్ కంటతడి పెట్టాడు.

ఇక అభి టాస్క్ చేయనని చెప్పడంతో.. అఖిల్ కు టాస్క్ చేయమని చెప్తాడు బిగ్ బాస్. ఇద్దరూ కలిసి గార్డెన్‌ ఏరియాలో కూర్చొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. తమ తమ క్యారెక్టర్‌ ఏంటో చెప్పుకున్నారు. ఆ తరువాత నందికొండ వాగుల్లోనా సాంగ్‌ రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు. సోహైల్‌ షర్ట్‌ విప్పి చిందులేశాడు. మరి దెయ్యం ఇంకా ఏమేం టాస్క్‌లు ఇచ్చిందో రేపటి ఎపిసోడ్‌లో చూసేద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =