
ట్యాగ్ · 2 కథనాలు

చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ

విజయ్ &విజయ్ "జ్వాల" మూవీ టీజర్ రిలీజ్
అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని , అరుణ్ విజయ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "అగ్ని సిరాగుగళ్ "తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "జ్వాల" మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీ లో అక్షర హాసన్ కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రైమాసేన్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమ్మ క్రియేషన్స్ టి.శివ సమర్పణలో శర్వాంత్రామ్ క్రియేషన్స్ , షిరిడిసాయి మూవీస్ బ్యానర్స్ పై తెరకెక్కిన "జ్వాల"మూవీ కి నటరాజన్ శంకరన్ సంగీతం అందించారు.
చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ "మహాత్మ ", "దరువు " వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. క్రైమ్ థ్రిల్లర్ "నాన్ " తమిళ మూవీ తో విజయ్ హీరోగా మారారు. సూపర్ హిట్ "బిచ్చగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను విజయ్ ఆకట్టుకున్నారు. విజయ్ హీరోగా రూపొందిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ "యమన్ ", "భేతాళుడు ", "ఇంద్ర సేన ", "రోషగాడు ", "కాశి ", "కిల్లర్ " మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. విజయ్ ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.