ఇండియన్ మైకైల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన నటుడు ప్రభుదేవా. టాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక వైపున దర్శకుడిగా సినిమాలు తీస్తూనే, మరో వైపున హీరోగాను ప్రభుదేవా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రభుదేవా త్రిష లేదా నయనతార ఫేమ్ అధిక్ రవిచంద్రన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భగీరా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభుదేవా షాకింగ్ లుక్‌తో విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైన అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ ఆగిపోగా.. తిరిగి ఈ సినిమా షూటింగ్ నిన్ననే ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రభుదేవా గుండు కూడా గీయించుకున్నారట.
ఇక ఈ సినిమాలో అమీరా దస్తర్, గాయత్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవా సైకోగా కనిపించనున్నాడు. ఇంతవరకూ చేయని పాత్రను ఆయన పోషిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో రాధే అనే సినిమాను తెరకెక్కిస్తూనే తమిళంలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, దర్శకునిగానే కాక నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు ప్రభుదేవా. భగీరా తో పాటు పోన్ మణికావేల్, థీల్, ఊమై విజిగల్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: