
ట్యాగ్ · 2 కథనాలు

'అల వైకుంఠపురములో' కోసం అడిషనల్ ట్రాక్స్

రిలీజ్ అయిన అల .. వైకుంఠపురములో .. మూవీ హిందీ రీమేక్ షెహజాదా టీజర్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల.. వైకుంఠపురములో మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ, యాక్షన్, డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అల.. వైకుంఠపురములో మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
'అల వైకుంఠపురములో' కోసం అడిషనల్ ట్రాక్స్
'అలవైకుంఠపురములో' సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. మొత్తంగా సోషల్ మీడియాలో 1 బిలియన్ వ్యూస్ వరకూ వచ్చాయి ఈ ఆల్బమ్ కి.