
ట్యాగ్ · 2 కథనాలు


6 సంవత్సరాల "భలే భలే మగాడివోయ్"
GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో నాని , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మగాడివోయ్ ” మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురళీశర్మ , నరేష్ , సితార , అజయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. హీరో నాని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మతిమరుపు నేపథ్యంలో కొన్ని విచిత్ర పరిస్థితుల్లో అతడిచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ అద్భుతంగా పండాయి. హీరో నాని , లావణ్య త్రిపాఠి ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్ "
హీరో నాని తాను నటించే మూవీస్ లో తన దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. యు వి క్రియేషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై నాని , లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురళి శర్మ , నరేష్ , వెన్నెల కిషోర్ , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.