శ్రియ కొత్త సినిమా ‘గ‌మ‌నం’ – ఫస్ట్ లుక్ రిలీజ్

Actress Shriya Saran New Movie Gamanam First Look Is Out

‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కథానాయికగా ఐదేళ్ళ పాటు కొనసాగడమే గగనమైపోతున్న ఈ కాలంలో దాదాపు రెండు దశాబ్దాలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసింది శ్రియ శరన్. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, ఆంగ్ల భాషా చిత్రాల్లో అగ్ర నటులతో నటించి అలరించింది. ఈ మధ్య యంగ్ హీరోయిన్స్ రావడంతో కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడులాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రియ‌ల్ లైఫ్ డ్రామాగా సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈరోజు శ్రియ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ చేతుల మీదుగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్ట‌ర్‌లో చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం మాత్ర‌మే ఉన్న ఒక అతి సాధార‌ణ గృహిణిలా క‌నిపిస్తున్నారు శ్రియ‌. మొత్తానికి ఇదివ‌ర‌కెన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో శ్రియ క‌నిపించ‌నున్నట్టే అర్ధమవుతుంది ఈ పోస్టర్ ను చూస్తుంటే.

ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ముగియగా… ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాత అవ‌తారం కూడా ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =