ట్యాగ్ · 3 కథనాలు
నాని హీరోయిన్ కోసం పెద్ద లిస్ట్..!
హైదరాబాద్ లో కోల్ కతా సెట్
మరోసారి పల్లెటూరి యువతి పాత్రలో సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి సూపర్ హిట్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీ లో పల్లెటూరి యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. "మిడిల్ క్లాస్ అబ్బాయి ", "కణం", "పడి పడి లేచె మనసు " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం" మూవీస్ లో నటిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నాని హీరోయిన్ కోసం పెద్ద లిస్ట్..!
గత ఏడాది గ్యాంగ్ లీడర్ సినిమా తో వచ్చిన నాని ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. పరిస్థితులు బాగుండి ఉంటే ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్ సిద్ధంగా ఉండేది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా నటించిన 'వి' సినిమా ఉగాది పండుగ రోజు మార్చి 25 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఆ సినిమానే ఇప్పటి వరకూ నోచుకోలేదు.
హైదరాబాద్ లో కోల్ కతా సెట్
హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఫిక్షన్ &ఫాంటసీ మూవీ "శ్యామ్ సింగ రాయ్ "రూపొందనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీ లో హీరో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించనున్నట్టు సమాచారం. ఈ మూవీ లో నాని కి జోడీగా సాయి పల్లవి నటించే అవకాశం ఉంది.