
ట్యాగ్ · 3 కథనాలు


సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది

ఈ సినిమా థీమ్ చాలా ఫ్రెష్‌గా వుంటుంది
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

సిద్దు జొన్నలగడ్డ సినిమా పేరు మారింది
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' 2020 జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిగా.. సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో కనిపించారు. వైవా హర్ష, ఝాన్సీ, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
'కృష్ణ అండ్ హిజ్ లీల' మీరు అనుకున్నదానికంటే ముందే వస్తుంది..!
క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, జెర్సీ ఫేమ్ శ్రద్దాశ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పరిస్థితి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగులు జరుపుకోడానికి అనుమతులు ఇస్తుండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పెండింగ్ లో పనులను పూర్తి చేసుకుంటున్నారు అందరూ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పనులు కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఈ ట్రైలర్ ను చిత్రయూనిట్ నిన్న విడుదల చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ సీన్లతో పాటు సస్పెన్స్ తో కూడుకున్న ఈ ట్రైలర్ సినిమాపై…