కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bigil Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ?

"నాళైయ తీర్పు "మూవీ తో కోలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ "కత్తి ", "తెరి", "మెర్సల్ ", "సర్కార్ ", "బిగిల్ "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. విజయ్ మక్కల్ అయక్కమ్ (విజయ్ పీపుల్ ఆర్గనైజేషన్ )పేరు తో పలు సేవా కార్యక్రమాలు విజయ్ నిర్వహిస్తున్నారు. అభిమానులు "దళపతి "అని ముద్దుగా పిలుచుకునే విజయ్ నటించిన "మాస్టర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా విజయ్ తెలుగుప్రేక్షకులకు పరిచయమే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'బిగిల్' ఖాతాలో మరో రికార్డ్ - రెండు యూరోపియన్ కంట్రీస్ లో రిలీజ్..!

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో గత ఏడాది దీపావళి కి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అట్లీ-విజయ్ కాంబినేషన్ లో మెర్సల్‌, సర్కార్‌ సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మూడోసారి వచ్చిన బిగిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకున్నారు. అంతేకాదు రూ.200 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది.

TFN Adminవాట్సాప్
Vijay Bigil Movie Telugu Rights Bagged By A Popular Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Telugu dubbing rights of Vijay Bigil sold out,Thalapthy Vijay Bigil Telugu rights bagged by East Co
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత చేతికి విజయ్ 'బిగిల్‌' తెలుగు రైట్స్

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ఇది మూడూ సినిమా కావడం తో దీనిపై కూడా మంచిఅంచనాలు ఉన్నయి. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేసుకున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అన్ని పనులు త్వరగా ముగించి దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్